విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మిషన్ కర్మయోగి సదస్సు ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మిషన్ కర్మయోగి సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యం, పరిపాలనా నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. పరిపాలనలో నూతన ఒరవడిని తీసుకురావడానికి, అధికారులకు మెరుగైన శిక్షణ అందించడానికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.