స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పెంపునకు సుప్రీంకోర్టు నిరాకరణ
రిపోర్టర్: సురేష్
స్థలం: Amaravati
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పెంపునకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఎస్ఈసీ అధికారులు తెలిపారు. పందొమ్మిది చోట్ల నామినేషన్లు అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం, ఫిర్యాదుల మేరకు రేపటిలోగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన గడువును ఈనెల ఇరవై ఐదు వరకు పొడిగించింది.