హైటెక్ సిటీలో నీటి సంక్షోభం: హాస్టళ్లు మూసివేతతో విద్యార్థుల అవస్థలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శేరిలింగంపల్లి

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో నీటి సంక్షోభం తీవ్రమైందని, వాటర్ ట్యాంకర్ల సమ్మె కారణంగా పీజీ హాస్టళ్లు, అపార్ట్మెంట్లకు నీటి సరఫరా నిలిచిపోయిందని తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్లోనే నీటి కొరత తలెత్తిందని, నారాయణ విద్యాసంస్థల హాస్టళ్లకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, ట్యాంకర్లకు పోలీసు రక్షణ కల్పించాలని వారు శేరిలింగంపల్లి జోన్ డీసీపీని కోరినట్లు వెల్లడించారు.