హైదరాబాద్ లో దారుణం: మద్యం మత్తులో ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని బోరబండ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. శిల్పినగర్ లో ఐదేళ్ల బాలుడు అనుమానాస్పదరీతిలో మృతి చెందగా, కన్నతండ్రే మద్యం మత్తులో చిన్నారిని గొంతునులిమి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. తల్లి క్యాటరింగ్ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు అపస్మారక స్థితిలో కనిపించాడని, నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారని ఎస్సై కాశయ్య వెల్లడించారు.