ముంబై విద్యార్థుల అద్భుత ప్రయోగం: తత్వశాస్త్రంపై పట్టు సాధిస్తున్న పిల్లలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Mumbai
ముంబై నగరంలో పదహారేళ్ల విద్యార్థి నీల్ త్రిపాఠి ప్రారంభించిన పెహ్లా ప్రశ్న అనే వినూత్న కార్యక్రమం ద్వారా చిన్న వయసులోనే పిల్లలకు తత్వశాస్త్రంపై అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువా అన్స్టాపబుల్ సంస్థ సహకారంతో మున్సిపల్ పాఠశాలల్లో చేపట్టిన ఈ విద్యా ప్రయోగానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, సంక్లిష్టమైన ఆలోచనలను కూడా చిన్నారులు సులభంగా అర్థం చేసుకుంటున్నారని వ్యవస్థాపకులు పేర్కొన్నారు.