పాలకొండలో రెండు రోజులుగా కరెంట్ లేక అల్లాడుతున్న కాలనీవాసులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇంద్రనగర్ కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా కరెంటు లేకపోయినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి కాలనీకి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.