ఆర్థిక ఇబ్బందులతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య: మరొకచోట తల్లి, కూతురు అదృశ్యం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది పురుగు మందు తాగి చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ పెదమజ్జి గోపి మృతి చెందారని ఎస్సై మహేశ్ వెల్లడించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండాం గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మరో ఘటనలో కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన ఐతంశెట్టి దివ్య, ఆమె నాలుగేళ్ల కుమార్తె శనివారం నుంచి కనిపించకుండా పోయారని, తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై పి.శివకేశవరావు తెలిపారు.