రైతుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని పందికాళ్ల మణి డిమాండ్
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ నరసింహారావుకు రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎరువుల యాప్లు రద్దు చేసి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఆయన కోరారు.