టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారంలో స్వచ్ఛంద బంద్
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
జన్నారం మండలంలో టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఉదయం బంద్ స్వచ్ఛందంగా ప్రారంభమైంది. జన్నారం బస్టాండ్, అంగడి బజార్, ధర్మారం చౌరస్తా, కవ్వాల్ చౌరస్తా ప్రాంతాలలో వ్యాపారులు తమ హోటళ్లు, కిరాణా దుకాణాలను పూర్తిగా మూసివేశారు. విద్యా సంస్థలకు ఈ బంద్ నుండి మినహాయింపునివ్వగా, ప్రస్తుతం మండలంలో బంద్ ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతోంది.