పాఠ్యపుస్తకాల్లో ముద్రణా లోపాలపై ఒడిశాలో నేడు బంద్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Bhubaneswar
పాఠ్యపుస్తకాల్లో భారీ తప్పుల ముద్రణకు నిరసనగా ఒడిశాలో పన్నెండు గంటల పాటు బంద్కు నబ నిర్మాణ కృషక్ సంఘటన్ పిలుపునిచ్చినట్లు జాతీయ సమన్వయకర్త అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ బంద్కు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదివే పుస్తకాల్లో తీవ్రమైన తప్పులు దొర్లాయని, దీనికి బాధ్యత వహిస్తూ పాఠశాల విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. బంద్ నేపథ్యంలో బస్సులు, వాణిజ్య సముదాయాలు మూతపడనున్నాయి.