సినిమా అప్డేట్: ది ప్రాంప్ట్ వార్ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
భారతీయ పురాణాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కలయికతో సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు ఆర్విహా క్రియేషన్స్ సిద్ధమవుతున్నట్లు నిర్మాత నరేష్ గౌడ్ వెల్లడించారు. దసరా పండుగ సందర్భంగా ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్ టైటిల్ను ప్రకటించారు. నూతన దర్శకుడు ప్రసన్న కొత్వాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.