తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామి అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులను కటాక్షించారు. ఉదయం శ్రీవారు దేవేరులతో కలిసి బ్రహ్మరథం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. భక్తకోటి గోవింద నామస్మరణ మధ్య ఆలయ తిరువీధుల్లో రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. బుధవారం ఉదయం చక్రత్తాళ్వార్కు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో నవతరగతి ఉత్సవాలు సంపూర్ణంగా ముగిసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.