అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణ మహిళ దుర్మరణం

రిపోర్టర్: రాము స్థలం: మహబూబాబాద్

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన సుప్రియ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున రెస్టారెంట్ మూసివేసి స్నేహితురాలితో కలిసి కారులో వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. విదేశాల్లో కూతురు మృతి చెందడంతో స్వగ్రామాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.