అవినీతిని వ్యతిరేకించండి: టోల్‌ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీకాకుళం
అవినీతి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నా వెంటనే స్పందించి ఫిర్యాదు చేయాలని SRIKAKULAM DISTRICT POLICE స్పష్టం చేశారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2026లో భాగంగా శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపొందించిన అవినీతి వ్యతిరేక పోస్టర్లను ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎలాంటి భయం లేకుండా 1064 టోల్‌ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకుని అవినీతిపై ధైర్యంగా ఫిర్యాదులు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.