జిల్లాలో తీవ్ర తాగునీటి సమస్య: అటకెక్కిన మంచినీటి పథకాలతో గ్రామీణుల అవస్థలు

రిపోర్టర్: విజయ్ స్థలం: మర్రిపాడు

జిల్లాలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మర్రిపాడు, సంగం, బిట్రగుంట, చేజర్ల మండలాల్లో శుద్ధజల కేంద్రాలు, తాగునీటి ట్యాంకులు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయని అధికారులు తెలిపారు. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీపీడబ్ల్యూ పథకాలు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అటకెక్కాయని, తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.