విజయవాడలో 130 ఏళ్ల నాటి చారిత్రక రైల్వే వంతెన తొలగింపు

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయవాడ

విజయవాడ సమీపంలోని కృష్ణా నదిపై 1893లో నిర్మించిన 130 ఏళ్ల నాటి చారిత్రక రైల్వే వంతెన తొలగింపు వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. రాతి బండలు, గానుగ సున్నంతో అత్యంత పటిష్టంగా కట్టిన ఈ పురాతన బ్రిడ్జిని తొలగిస్తుండటంపై స్థానికులు మరియు చరిత్ర ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.