కాంగ్రెస్ మోసాలపై అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని వారు మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, రూ.500కే గ్యాస్ వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.