'మహిళల గురించి తప్పుగా మాట్లాడితే దబిడి దిబిడే': మంత్రి నారా లోకేష్ వార్నింగ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిళల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే దబిడి దిబిడే అంటూ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు అని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లోనూ కూటమి బలంగా కొనసాగుతుందని, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలపై పెట్టిన దొంగ కేసులను యుద్ధ ప్రాతిపదికన ఎత్తివేస్తామని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు లోకేష్ తెలిపారు.