కాంగ్రెస్ వైఫల్యంతోనే రాష్ట్రంలో కరువు అంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
ఎల్ నినో పేరు చెప్పి రైతులకు సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకు వస్తోందని ఆయన నిలదీశారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.