జాతీయ లోక్ అదాలత్ తో వేగంగా ఉచిత న్యాయం పొందండి

రిపోర్టర్: JR RAO స్థలం: శ్రీకాకుళం

డిసెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు వెల్లడించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబ్రోలు ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో లోక్ అదాలత్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదావకాశాన్ని కక్షిదారులు అందరూ సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంతో వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.