పట్టణాల్లో ఆస్తి పన్ను వసూళ్లలో అవినీతి: పుర అధికారుల చేతివాటం బట్టబయలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: బొబ్బిలి
పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ఆస్తి పన్ను వసూలులో పుర అధికారుల చేతివాటంతో ఆదాయానికి భారీగా కన్నం పడుతోందని ఈనాడు కథనం వెల్లడించింది. బొబ్బిలి పట్టణంలో సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా పన్ను విధింపులో పారదర్శకత మెరుగుపడలేదని విమర్శలు వస్తున్నాయి. కీలకమైన పన్నుల వసూళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.