హైవేపై భారీ ట్రాఫిక్ జామ్: దసరా రద్దీతో బారులు తీరిన వాహనాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: యాదాద్రి భువనగిరి
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, భారీగా తరలివచ్చిన సొంతూరి ప్రయాణికుల రద్దీతో రాకపోకలు పూర్తిగా మందగించాయని పోలీసులు వెల్లడించారు.