తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: పలు విమాన సర్వీసులు రద్దు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Visakhapatnam
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాలలో రాకపోకలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు విమానయాన సంస్థలు తమ సేవలను రద్దు చేశాయని, ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.