నర్సీపట్నంలో అరవై మంది విద్యార్థులకు శ్రీరామ్ ఫైనాన్స్ చేయూత

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నంలో శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచి కార్యాలయంలో శనివారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న అరవై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. బ్రాంచి మేనేజర్ రుత్తల శ్రీను మాట్లాడుతూ విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకొని విద్యకు సంబంధించిన సాగమ్రి కొనుగోలుకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది శ్రీనివాసరావు, గోపి, లచ్చరాజు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.