తెలంగాణలో కరువు పరిస్థితులపై రేవంత్ రెడ్డి సర్కార్పై హరీష్ రావు ఆఫీస్ నిప్పులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: సిద్దిపేట

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు ఆఫీస్ మండిపడింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు పారుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిని వదిలేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో లేని కరువు తెలంగాణలో ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తూ, ప్రజాధనాన్ని, జల వనరులను పక్క రాష్ట్రానికి ధారపోస్తున్నారని ఆ సంస్థ తీవ్రస్థాయిలో విమర్శించింది.