గుట్టుచప్పుడు కాకుండా గోడ బద్దలుకొట్టి లక్షల విలువైన బాణాసంచా చోరీ
రిపోర్టర్: రమేష్
స్థలం: అహ్మదాబాద్
పోలీసులు సీజ్ చేసిన షాపు గోడను బద్దలుకొట్టి భారీ ఎత్తున బాణాసంచా అపహరించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. నిందితుడు పంకజ్ రాజేష్ భాయ్ రాణా పక్కనే మరో షాపును అద్దెకు తీసుకుని ఈ దొంగతనానికి పాల్పడ్డాడని, చోరీ తర్వాత గోడను మళ్లీ నిర్మించి ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేశాడని స్థానిక పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.