ఈడబ్ల్యూఎస్ కోటాలో రాజకీయ రిజర్వేషన్ల కోసం రవీంద్ర సింగ్ భాటి యాత్ర

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బార్మర్

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా షియో స్వతంత్ర ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ భాటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ప్రత్యేక యాత్రను ప్రారంభించనున్నారు. పంచాయత్ ఎన్నికల నేపథ్యంలో అగ్రవర్ణాల రిజర్వేషన్ డిమాండ్‌తో ఆయన ఈ ఐదు రోజుల యాత్ర చేపట్టారు. జోధ్‌పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన యువతలో బలమైన పట్టు కలిగి ఉన్నారు.