ఆదిలాబాద్ రిమ్స్ లో శిశు మరణాలపై కవిత ఫైర్

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో గత ఏడాది జరిగిన శిశు మరణాలపై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. రిమ్స్ లో 1500 మంది పిల్లలు చేరితే ఏకంగా 204 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.