'మరి నేను ఏం చేయాలి, బాయిలో దూకాలా?': భూముల నిషేధిత జాబితా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే డబ్బులు తీసుకున్నారంటారని, తొలగించకపోతే అమాయకుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైందని వాపోయిన ఆయన, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఏం చేయాలని, బాయిలో దూకాలా అంటూ అసెంబ్లీ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.