సీలేరులో భక్తిశ్రద్ధలతో సాయిబాబా ఉత్సవాలు: వైభవంగా అన్నదానం, పేదలకు వస్త్రదానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం సీలేరులో శ్రీ షిరిడీ సాయిబాబా జన్మదిన వేడుకలు వైభవంగా ముగిశాయి. గత ఐదు రోజులుగా కమిటీ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా, ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేపట్టారు. సాయంత్రం పేదలకు ఉచితంగా వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీటీసీ పిల్లా సాంబమూర్తి, ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పలనాయుడు, కమిటీ సభ్యులు లక్ష్మణ్, రమణ మరియు విష్ణు తదితరులు విశేషంగా హాజరయ్యారు.