మద్యం రవాణా అవకతవకల కేసులో మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్ విచారణ

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

మద్యం రవాణా అవకతవకల కేసులో మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్గా పనిచేసిన ఆయనను సీపీ కార్యాలయంలోని సిట్ ఆఫీసులో అధికారులు సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించారు. మద్యం రవాణా టెండర్లు, నిబంధనల ఉల్లంఘనలపై అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఈ విచారణలో లభించిన వివరాల ఆధారంగా ఆయనను మరోసారి పిలిచే అవకాశం ఉన్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి.