హైదరాబాద్లో ఘనంగా హైకూ సినిమా ప్రెస్మీట్: అక్టోబర్ 23న గ్రాండ్ రిలీజ్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'హైకూ' చిత్రం అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రముఖ రచయిత కోన వెంకట్ హైదరాబాద్లో తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. లవ్, రిలేషన్షిప్ అంశాలతో కూడిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని హీరోయిన్ శ్రీదేవి, హీరో ఏగన్ ధీమా వ్యక్తం చేశారు.