వయసుతో నిమిత్తం లేకుండా సోషల్ వర్క్లో మాస్టర్స్ పూర్తి చేసిన వృద్ధుడు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సులో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన కృష్ణ కుమార్ గుప్తా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు సాధించారని ఇగ్నో వర్సిటీ అధికారులు తెలిపారు. వృద్ధాప్యంలోనూ విద్యపై ఆయన చూపిన అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమ కంజిలాల్ అభినందించారు.