పాకిస్థాన్ నూతన టీ20 కెప్టెన్గా సాహిబ్జాదా ఫర్హాన్ నియామకం

రిపోర్టర్: రాము స్థలం: Lahore

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం నూతన టీ20 కెప్టెన్గా ఓపెనింగ్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ను నియమించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. గత టోర్నీల్లో విఫలమైన సల్మాన్ అలీ ఆఘా స్థానంలో ఫర్హాన్కు బాధ్యతలు అప్పగించారు. శ్రీలంకతో జరగనున్న సిరీస్ కోసం ప్రకటించిన టీ20 జట్టు నుంచి సల్మాన్ ఆఘాతో పాటు బాబర్ ఆజమ్, షాహిన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్లను తప్పించారు. అయితే వీరు ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగే వన్డే త్రైగోష్టి సిరీస్కు ఎంపికయ్యారు.