రణ్జీ ట్రోఫీ: అజేయ సెంచరీతో మెరిసిన సచిన్ యాదవ్

రిపోర్టర్: విజయ్ స్థలం: జైపూర్

సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రైల్వేస్తో జరుగుతున్న రణ్జీ ట్రోఫీ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్ సచిన్ యాదవ్ అజేయ సెంచరీతో మెరిశాడని క్రీడా వర్గాలు తెలిపాయి. ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులో నిలదొక్కుకున్న అతను 221 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరణ్ లంబాతో కలిసి అజేయ భాగస్వామ్యం నమోదు చేసిన సచిన్ యాదవ్, తొలి రోజు ఆట ముగిసేసరికి రాజస్థాన్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడని పేర్కొన్నాయి.