ఓట్ల తొలగింపు కుట్రలపై కేంద్ర ఎన్నికల సంఘంపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిప్పులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: సూర్యాపేట
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం లేని వారి ఓట్లను తొలగిస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, సీఈసీ ద్వారా ఓటరు జాబితాను ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ముప్పై శాతం ఓట్లు దెబ్బతింటున్నాయని, ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.