ముంబైలో అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టిన బీఎంసీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: మహారాష్ట్ర
ముంబై అంధేరిలోని చిత్రకూట్ మైదానంలో ఫైర్ స్టేషన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ గ్యారేజ్, మ్యారೇజ్ హాల్‌ను బీఎంసీ అధికారులు నేలకూల్చారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజల రక్షణ కోసం త్వరలోనే ఫైర్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.