రాష్ట్రంలో భారీగా మ్యాగ్నెట్ల తయారీకి పెట్టుబడుల ప్రణాళికలు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మ్యాగ్నెట్ల తయారీ రంగంలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నవీన్ అగర్వాల్ అండ్ నైవేద్య అగర్వాల్ నెట్వర్క్ ప్రతినిధుల బృందం ముందుకు వచ్చింది. అమరావతిలో సీఆర్డీఏ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలను సమర్పించారు. రాజధానిలో అభివృద్ధి పనులను పరిశీలించిన బృందానికి పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని సీఆర్డీఏ కమిషనర్ వి.విజయరామరాజు హామీ ఇచ్చారు.