రామభద్రపురం స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర పోరు: బరిలో తల్లీకూమార్తెలు

రిపోర్టర్: అశోక్ స్థలం: రామభద్రపురం

రామభద్రపురం మండలంలోని కోటశిర్లాం ఎంపీటీసీ స్థానంలో ప్రధాన పార్టీల తరఫున తల్లీకుమార్తెలిద్దరూ పోటీపడుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైందని జయలక్ష్మి, వెంకటలక్ష్మి తెలిపారు. వైకాపా అభ్యర్థిగా బప్పడాల వెంకటలక్ష్మి బరిలో నిలవగా, ఆమె కుమార్తె జయలక్ష్మి తెదేపా తరఫున పోటీలో ఉన్నారు. బంధువులు ఎవరికి ఓటు వేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ విభిన్న రాజకీయ పరిణామం చుట్టుపక్కల ప్రాంతాల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.