చిరంజీవి కాకా సినిమాలో విలన్గా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా ద్వారా ఆయన తెలుగు తెరపైకి అడుగుపెడుతున్నారని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.