ఎమ్మెల్యే రూమ్ లో అభ్యంతరకర స్థితిలో జంట: తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దినేష్ జైన్

రిపోర్టర్: శివ స్థలం: Bhopal

తనకు కేటాయించిన గదిలో యువ జంట అభ్యంతరకర స్థితిలో కనిపించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ జైన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఎమ్మెల్యేల రెస్ట్ హౌస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన అనుమతి లేకుండా గది తాళాలు ఎలా ఇస్తారని సిబ్బందిని ఆయన నిలదీశారు. ఈ భద్రతా లోపంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ ముఖ్య కార్యదర్శికి ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు.