విశ్వకర్మ పూజ వేళ కోల్‌కతాలో అపకాబ్ ఛార్జీలు భారీగా పెంపు
రిపోర్టర్: శివ
స్థలం: కోల్‌కతా
కోల్‌కతాలో విశ్వకర్మ పూజ సందర్భంగా బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు వర్షం కురవడంతో యాప్ క్యాబ్ సంస్థలు ఇష్టానుసారంగా ఛార్జీలను భారీగా పెంచాయి. డ్రైవర్ల కొరత కారణంగా రద్దీ విపరీతంగా పెరిగిందని, సాధారణం కంటే రెట్టింపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు.