హైదరాబాద్‌లో త్వరలో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ట్రావెల్ పాస్!

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరవాసులకు ఒకే పాస్‌తో మెట్రో రైలు మరియు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రానుంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ ఉమ్మడి ట్రావెల్ పాస్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రోజువారీ, వారపు మరియు నెలవారీ పాస్‌లను తీసుకురానున్నారు. నెలవారీ ఉమ్మడి పాస్ ధరను రూ. 7,500గా ఆర్టీసి యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.