అల్లూరి జిల్లాలో వంతెన కొట్టుకుపోయి గర్భిణీ దుర్మరణం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Alluri Sitharama Raju District
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు వాగు ఉద్ధృతికి వంతెన కొట్టుకుపోవడంతో ఆసుపత్రికి వెళ్లే దారిలేక ఓ గర్భిణీ బాలుడికి జన్మనిచ్చి మృతి చెందింది. ఈ విషాద ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తరలించేందుకు రోడ్డు మార్గం లేక తాళ్లు కట్టుకుని వాగు దాటించాల్సి వచ్చిందని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనను తిరిగి నిర్మించి తమ ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీర్చాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.