'చిన్నారుల మృతి తీవ్రంగా కలిచివేసింది': సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: Sangareddy
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పెద్దకంజర్ల గ్రామం నెరడు చెరువులో విగ్రహ విసర్జన సందర్భంగా సిరిషా చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎనుముల రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.