బిహార్‌లో యువతి యువకుడిని వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

రిపోర్టర్: విజయ్ స్థలం: బిహార్

బిహార్‌లోని జముయ్‌లో రాత్రి సమయంలో ఓ యువతి, యువకుడిని కొందరు వ్యక్తులు చుట్టుముట్టి వేధించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖం కప్పుకున్న ఓ వ్యక్తి యువతిని లాకెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె అరుస్తూ ప్రతిఘటించింది. ఈ ఘటనపై స్పందించిన బిహార్ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జముయ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే అంశంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.