భారత పర్యటనకు వెస్టిండీస్ వన్డే మరియు టీ20 జట్ల ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: India
టీమ్ ఇండియాతో తలపడేందుకు షాయ్ హోప్ సారథ్యంలోని వెస్టిండీస్ వన్డే, టీ20 జట్లను క్రికెట్ వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు భారత్ వేదికగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ వన్డే జట్టులోకి తిరిగి రాగా, సీనియర్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌కు విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లకు ఈ పర్యటనలో పెద్దపీట వేశారు.