నిరుద్యోగులకు గుడ్ న్యూస్: గ్రూప్-2లో 686 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ మరో తీపి కబురు అందించిందని, జాబ్ క్యాలండర్ ప్రకారం 1,466 ఉద్యోగాల భర్తీకి పది ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేశామని ఇన్ఛార్జ్ ఛైర్మన్ శశిధర్ తెలిపారు. అన్ని రకాల పోస్టులు కలిపి గ్రూప్-2లో 686 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, గ్రూప్-2 పూర్తిస్థాయి ప్రకటనను నవంబరు 9న విడుదల చేస్తామని, నాన్ యూనిఫాం ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు.