అస్సాంలో భారీ ఆర్థిక మోసం గుట్టురట్టు: ఆరుగురి అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Guwahati
అస్సాంలో భారీ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా నిధులను మళ్లన్నట్లు విచారణలో వెల్లడైంది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లతో వీరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.