హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: బైక్ అదుపుతప్పి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రిపోర్టర్: గోపి
స్థలం: Rangareddy
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంగరకలాన్ సర్వీస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూపతి దాసు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కుమారుడు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.